Friday, May 17, 2024
- Advertisement -

పారిస్​ ఒప్పందం.. అంతా మోదీ కట్టడి..!

- Advertisement -

వాతావరణంలో హానికారక ఉద్గారాల కట్టడికి ఉద్దేశించిన ‘పారిస్​ ఒప్పందం’లోని లక్ష్యాలను మించి భారత్​ విజయాలను సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2005 నాటితో పోలిస్తే ఈ ఉద్గారాల తీవ్రతను 21 శాతం మేర తగ్గించామని తెలిపారు. శనివారం జరిగిన ‘వాతావరణ లక్ష్య సదస్సు-2020’ను ఉద్దేశించి ఆయన వర్చువల్​గా ప్రసంగించారు. పారిస్​ ఒప్పందం కుదిరి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోందని ఆయన గుర్తుచేశారు.

లక్ష్యాలను మరింతగా పెంచుకునే క్రమంలో గతాన్ని మనం విస్మరించరాదు. మన లక్ష్యాలను సవరించుకోవడమే కాకుండా.. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాలకు సంబంధించి మనం సాధించిన విజయాలను సమీక్షించుకోవాలి. అప్పుడే.. భావితరాల శ్రేయస్సు విషయంలో మన మాటలకు విశ్వశనీయత పెరుగుతుంది అని మోదీ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -