Monday, June 17, 2024
- Advertisement -

మందు తాగడం ఒక్కసారిగా మానేస్తే మంచిదేనా?

- Advertisement -

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది తెలిసినా ప్రతి రోజు తాగుతూనే ఉంటారు. అయితే కొంతమందిలో పరివర్తన వచ్చి మద్యం బంద్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడి ఒక్కసారిగా మానెస్తే శరీరంలో ఏం జరుగుతుంది?ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని చాలా మందికి సందేహం ఉంటుంది.

అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మద్యం రోజూ తాగినా, అప్పుడప్పుడూ తాగినా, అది శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పురుషులైనా, మహిళలైనా ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుంది. చాలా కాలంగా మద్యం సేవిస్తున్నవారు మానేయాలని నిర్ణయించుకుంటారు. దీని వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చని అనుకుంటారు. అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైనవారు హఠాత్తుగా దాన్ని మానేసినా కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు.

తాగడం మానేసిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి జారి పోతారు.
దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఏ అలవాటైన మనకు మంచి చేసేదిగా ఉండాలి కానీ దాని ద్వారా ఆరోగ్యం నాశనమై,చివరకు ప్రాణాంతంకంగా మారేవరకు తెచ్చుకోకూడదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -