- Advertisement -

మెంతినీరు త్రాగితే ఎన్ని లాభాలో..!

- Advertisement -

మెంతి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతి గింజలను నీటిలో నానబెట్టి,ఆ నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. షుగర్ సమస్యకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మెంతులు ఫైబర్ మరియు ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేయడమే కాకుండా కార్బోహైడ్రేట్లు మరియు చక్కెరను శరీరం గ్రహించడాన్ని తగ్గిస్తాయి.

30 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు మరియు స్త్రీలలో టైప్ 2 మధుమేహం నివారణలో మెంతుల పాత్రపై పరిశోధన నిర్వహించగా మంచి ఫలితం వచ్చింది. మెంతులు తినేవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, పోస్ట్‌ప్రాండియల్ ప్లాస్మా గ్లూకోజ్ మరియు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది .

ముఖ్యంగా బరువును తగ్గించడంలో మెంతినీరు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా మలబద్దకంతో బాధపడే వారికి ఇదోక దివ్యా ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణుల అంచనా. మెంతులలో ఉండే విటమిన్ సి, కె కారణంగా చర్మసమస్యలను తగ్గించడంలో కూడా సహాయ పడుతుందట. ప్రతిరోజూ మెంతినీరు త్రాగితే స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -