Tuesday, May 21, 2024
- Advertisement -

చెమ‌టులు క‌క్కే రోబోల‌ను త‌యారు చేసిన జాపాన్ ….

- Advertisement -

జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు స‌రికొత్త రోబోల‌ను త‌యారు చేశారు. మనుషుల్లాగ‌నే క‌ష్ట‌మైన ప‌నులు, వ్యాయామాలు చేసిన త‌ర్వాత చెమ‌ట‌లు వ‌చ్చే రోబోల‌ను త‌యారుచేశారు. కెన్‌షిరో, కెన్‌గోరో అని పేర్లు గ‌ల రెండు రోబోలు వ్యాయామం చేసి అచ్చం మ‌నుషుల్లాగే చెమ‌టలు వెద‌జ‌ల్లుతున్నాయి. అంతేకాకుండా పుషప్స్, సిటప్స్, క్రంచెస్, స్ట్రెచెస్‌ వంటి వివిధ ర‌కాల‌ వ్యాయామాలన్నీ చేసేస్తుంది.

ఏదో శారీర‌క చ‌ర్య‌లు జ‌రిగి ఈ రోబోల‌కు చెమ‌ట ప‌డుతుంద‌నుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. వీటి శ‌రీరంపై ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటి ఆవిరిని పంపించి, చెమట పట్టిన భావ‌న‌ను క‌లిగేలా చేశారు. మ‌నుషుల శ‌రీర స్వ‌భావాన్ని పూర్తిగా అధ్య‌య‌నం చేయ‌డానికి ఈ చెమ‌ట ప‌ట్టే రోబోల‌ను ఉప‌యోగించవ‌చ్చు.

త్వ‌ర‌లోనే స్ప‌ర్శ‌జ్ఞానం, స్వ‌యం చాల‌క‌శ‌క్తి వంటి చ‌ర్య‌ల‌ను కూడా మెషీన్ లెర్నింగ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ఈ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -