Friday, May 9, 2025
- Advertisement -

117 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేసిన కుమార‌స్వామి..

- Advertisement -

క‌ర్నాట‌క రాజ్‌భ‌వ‌న్ ముందు హైడ్రామా చోట‌చేసుకుంది. కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠను రేపాయో….వాటి ఫలితాలు `అంతకు మించి` తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను జేడీఎస్‌ నేత కుమారస్వామి, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం తమకు ఉందని గవర్నర్‌కి తెలిపారు. 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించారు.

ప్రత్యేక బస్సుల్లో ఆ 118 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. తన బలం నిరూపించుకునేందుకు అవసరమైతే గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేలలతో పరేడ్ నిర్వహించేందుకు కూడా తాను సిద్ధమని కుమారస్వామి చెప్పినట్లు తెలుస్తోంది.

గవర్నర్ రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని, ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నమ్ముతున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -