Wednesday, April 24, 2024
- Advertisement -

మీ వైరం అక్కడ కూడనా.. ఎంటిది ?

- Advertisement -

ఏపీ వైసీపీ, టిడిపి మద్య రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పు, నిప్పు లాగా ఈ రెండు పార్టీల మద్య రగడ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మద్య రగడ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఇంతటి రాజకీయ వైరం ఉన్న ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు మరియు జగన్ లు ఒకే వేదిక పై కనిపిస్తారా ? ఒకవేళ కనిపిస్తే మాట్లాడుకుంటారా ? అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల మదిలో ఎన్నో రోజుల నుంచి మెదులుతున్నాయి.

అయితే ఈ ఇద్దరు ఒకే వేదికను పంచుకునే సందర్భాలు ఎప్పుడు చోటు చేసుకోలేదు. కానీ ఈ మద్య కాలంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మోడీ ఆహ్వానం మేరకు బాబు, జగన్ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందని అందరు భావించారు. కానీ బాబు ముందుగా తర్వాత జగన్ అన్నట్లుగా ఎదురు పడకుండానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సభను ముగించారు. ఇక ఆగష్టు 15 సందర్భంగా మరో సారి వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చేసే అవకాశం వచ్చింది. ఆగష్టు 15 సందర్భంగా ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఇచ్చిన తేనీటి విందుకు చంద్రబాబు, జగన్ హాజరు అయ్యారు.

అయితే ఇక్కడ కూడా ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. సాధారణంగా ప్రముఖులు ఇచ్చే విందులో గౌరవ అతిథులుగా వచ్చిన వారు ఇతరుల పట్ల నమస్కారానికి ప్రతి నమస్కారాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం కానీ.. కానీ జగన్, బాబు సాధారణ నమస్కారాలు కూడా చేసుకోకపోవడం గమనార్హం. చంద్రబాబు టీడీపీ నేతలతో గవర్నర్ విందు కు హాజర్ అయితే.. వైఎస్ జగన్ సకుటుంభ సమేతంగా విందుకు హాజరు అయ్యారు. ఏది ఏమైనప్పటికి రాజకీయ వైరం ఉన్న బాబు, జగన్ లు కనీసం వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.

Also Read

మోడీని దువ్వుతున్న బాబు..!

జనసేన అధికరంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయా ?

మోడీజీ.. విజన్ 2047 నెరవేరేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -