- Advertisement -
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి అంబరీష్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. గుండెపోటు రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
అభిమానులు ఆయనను అబీ అని ముద్గుగా పిలుచుకుంటారు. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉన్న ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం అంబి నింగ్ వయస్సయతో చివరి చిత్రం. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కాంగ్రెస్‌లో ఆయన రెబెల్ పొలిటిషియన్‌గా పేరు పొందారు.