Wednesday, May 15, 2024
- Advertisement -

టీడీపీకి షాక్..వైసీపీలోకి.. విజయవాడ ఎంపీ

- Advertisement -
kesineni nani jump ti the ysrcp congress party soon

మొన్నటి వరకు.. చాలా మంది వైసీపీ పార్టీ నుంచి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ లోకి వలస వెళ్లారు. ఇక అక్కడితో జగన్ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు అందరు కాని ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పటికే కర్నూలు జిల్లాలో వలసలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయగా.. ఇప్పుడు విజయవాడ విషయంలో వలసల రాజకీయం ఆసక్తిని రేపుతోంది. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని చంద్రబాబు రాజకీయం చేయబోగా.. తెలుగుదేశం నుంచి నేతలను తన వైపుకు తిప్పుకుని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గట్టి పంచ్ ఇచ్చాడు. అయితె ఇప్పుడు విజయవాడ ఎంపీ కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహరణ తీరును అంతా గమనిస్తూనే ఉన్నారు. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆఖరికి తన బస్సులను కూడా ఆపేసుకున్నాడు నాని. స్వయంగా టీడీపీ ఎంపీ అవినీతి అంశంలో మాట్లాడుతుంటే సరికి తెలుగుదేశం అధిష్టానం ఉలిక్కి పడింది. కేశినేని నానితో లోకేష్ బాబు మాట్లాడాడు. బహిరంగ వేదికలపై మాట్లాడవద్దని సూచించాడు.

{loadmodule mod_custom,GA2}

మరి నిన్నలా మొన్న వచ్చిన లోకేష్ ఇలా తమకు ఆదేశాలు జారీ చేస్తుండే సరికి కేశినేని నాని వంటి వాళ్లకు సహజంగానే మండుతుందని చెప్పాలి. ఈ క్రమంలో నాని చూపు వైకాపా వైపు మల్లిందని సమాచారం. అన్ని రకరకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతూ తెలుగుదేశంలో ఉండటం కంటే వైకాపా వైపు వెళ్లడం మేలనే అభిప్రాయంతో ఉన్నాడట నాని.

{youtube}hRvA4KMiUoQ{/youtube}

Related

  1. వైసీపీనుంచి అఫ‌ర్ ఉంద‌ని ప్ర‌క‌టించిన ఏవి సుబ్బారెడ్డి…
  2. సినిమాలకు గుడ్ బై… వైసీపీనుంచి పోటీనా….?
  3. వైసీపీ వ్యూహానికి భూమా వ‌ర్గం విల‌విల‌..
  4. వారిద్ద‌రి దూకుడు భ‌విష్య‌త్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -