Sunday, May 5, 2024
- Advertisement -

15 ఏళ్లలోపే నుంచే మందు తాగుతున్నారా..?

- Advertisement -
Alcohol is Very Dangerous

మన ఫ్రెండ్స్.. మామా ఈ రోజు మందేద్దామా అని అంటూ ఉంటే.. మన ఫ్రెండ్ తాగితే లేనిది.. నేను తాగితే తప్పా..? అని ఆలోచిస్తాం. ఒక్కసారి తాగితే ఏం కాదులేరా.. ఈ సారికి తాగు అని అడిగితే… సరే ఒక్కసారే.. టేస్ట్ చేసి వదిలేద్దాం అని సర్ది చెప్పుకుంటాం. చాలా మంది ఫ్రెండ్స్ ద్వారా ఇలాగే ఆల్కహాల్ అలవాటవుతుంది.

{loadmodule mod_custom,GA1} 

ముఖ్యంగా టీనేజీలో ఉన్నప్పుడు సరదాగా మొదలై చివరకు ఇదొక వ్యసనంగా మారుతుంది. ఒకప్పుడు మద్యం తాగాలంటే.. ఓ వయసు వచ్చాకే మొదలు చేసేవారు. కానీ ప్రస్తుతం టీనేజీలోకి దీనికి అలవాటు పడుతున్నారు. చాలా మంది బీర్, వోడ్కా తాగేస్తున్నారు. కానీ టీనేజీలో మందుకొట్టడం స్టార్ట్ చేస్తే.. వారికి అమెరికా పరిశోధకులు ఓ భారీ హెచ్చరికను జారీ చేశారు. పదిహేనేళ్లలోపే మందు తాగే అలవాటు ఉంటే.. ముందుగానే చనిపోతారని బాంబు లాంటి వార్తను వదిలారు. వీరేమీ ఆషామాషీగా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇందుకోసం మూడు దశాబ్దాలపాటు 15 వేల మందిపై పరిశోధనలు చేశారు. మద్యం ముట్టని వారితో పోలిస్తే.. 15 ఏళ్లలోపు ఒక్కసారైనా మందేసిన వారు చనిపోయే ముప్పు 47 శాతం ఎక్కువగా ఉందట. 15 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయసు వచ్చాక మద్యపానం అలవాటైన వారిలో త్వరగా మరణించే ముప్పు 26 శాతం ఎక్కువట. టీనేజ్ లో మద్యం తాగాడం వల్ల ఆల్కహాల్ సంబంధిత అసమతుల్యతల కారణంగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన హుయి హు తెలిపారు.

{loadmodule mod_custom,GA2} 

15 ఏళ్లలోపే మందు ముట్టిన వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తేలింది. పదిహేనేళ్ల లోపు ఆల్కహాల్ సేవించిన వారిలో 26 శాతం మంది చిన్న వయసులోనే చనిపోయారు. వీరు చనిపోవడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణంగా కాకపోయినప్పటికీ.. మందు తాగడం కూడా ప్రధాన కారణమే. సో మందు అలవాటు ఎంత దూరం పెడితే అంత మంచింది. 

{youtube}Ae55WUWZI1k{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. లైంగిక కోర్కెలను పెంచే ఔష‌ధం…కిలో రూ.60 ల‌క్ష‌లు
  2. క్యాబ్ బుక్ చేసుకున్నందుకు.. ఆ డ్రైవర్ ఆమెను ఏం చేసాడో తెలుసా..?
  3. ప్రియుడు మోజులో పడి.. భర్తను చప్పిన నటి.. చివరికి ఏం జరిగింది..?
  4. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -