వైసీపీ నేతలు.. ఫ్లీనరీ వేదికగా.. సంచలనం సృష్టిస్తున్నారు. పార్టీ గురించి గొప్పగా చెపుతూ.. అన్ని విధాలుగా అధినాయకుడి గురించి చెపుతునే.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహంను నింపుతున్నారు. ఈ క్రమంలో ఈ ఫ్లీనరీ వేదికగా కొడాలి నాని మాట్లాడుతూ.. పార్టీపై , జగన్ పై తనదైన శైలిలో మాట్లాడారు.
అధికార పార్టీ అయిన టీడీపీని తిడుతునే..ఎల్లోమీడియా, టీడీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. లేని వాటిని ఉన్నట్లు అసత్య ప్రచారాలు చేస్తూ.. ఉన్నవి లేనివి జగన్ పై విరుచుకుపడుతున్నారు. అది కరెక్ట్ కాదని అన్నారు. జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు. తమకు నచ్చినట్లు వార్తలు రాసి.. జగన్ ఇమేజ్ ను డామేజ్ చేయాలని ప్లాన్ చేసి మరి ఈ పని చేస్తున్నారని అన్నారు. ఎన్ని ఎత్తులు వేసిన.. జగన్ ని ఏం చేయాలేరని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ప్రతి వ్యక్తికి అర్ధం అయ్యాలేలా.. వైసీపీ అధికారంలోకి వస్తే..పేదవాడికి, బడుగు బలహీన వర్గాగాలకి విద్యార్ధులకి డ్వాక్రా మహిళలకి, వృద్దులకి, వికలాంగులకి జగన్ సీఎం అయితే ఏం చేస్తారన్న విషయాన్ని ప్రజలందరికి తెలిసేలా చెప్పాలని కొడాలి నాని సూచించారు.
ప్రతి గ్రామం నుండి.. 50 మంది ప్రజలను ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. మరి నాని ఇచ్చిన ఈ సలహాను జగన్ పాటిస్తారో లేదో చూడాలి.
{youtube}aGE7hJF7M28{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related