Friday, May 9, 2025
- Advertisement -

అంత బలం ఉన్నా మోడీ తగ్గారు.. సంతోషం!

- Advertisement -

భూ సేకరణ చట్టం లో సవరణలు అంటూ వరసగా ఆర్డినెన్స్ లు జారీ చేసుకొంటూ పోయిన మోడీ ప్రభుత్వం చివరకు వెనక్కు తగ్గింది. నేటితో ఆ ఆర్డినెన్స్ గడువు ముగియడంతో..

ఇదే సమయంలో మోడీ సర్కారు తమ తదుపరి విధానాన్ని కూడా ప్రకటించింది. ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో ఇక మళ్లీ ఆర్డినెన్స్ ను జారీ ఉద్దేశం ఏదీ తమకు లేదని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ లో భాగంగా ప్రకటించారు. దీంతో భూ సమీకరణ చట్టంలో సవరణల విషయంలో మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టేనని అనుకోవాల్సి వస్తోంది. మరోసారి ఆర్డినెన్స్ ను జారీ చేసి నవ్వుల పాలయ్యే ప్రయత్నం చేయకుండా ఈ విషయంలో ప్రతిపక్షాల కు అనుగుణంగా మోడీ ప్రభుత్వం తలొగ్గింది. 

భూ సమీకరణ చట్టంలో సవరణ ప్రతిపాదనలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని .. తాము చేసిన చట్టానికి మోడీ ప్రభుత్వం సవరణలు తీసుకురావడం అనేది ఆయన కోసం ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కార్పొరేట్ సంస్థల కోసమే అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. అయితే ఈ విషయంలో బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆర్డినెన్సుల మీద ఆర్డినెన్సులు జారీ చేస్తూ వచ్చింది. సవరణల బిల్లు లోక్ సభలో ఆమోదం పొందినా.. రాజ్యసభలో మాత్రం ఆమోదం పొందలేదు. అక్కడ తగుస్థాయి బలం లేకపోవడంతో మోడీ అండ్ కో వెనక్కు తగ్గుతూ వచ్చింది.

వెంకయ్య నాయుడు వంటి వాళ్లు మాత్రం తాము తెస్తున్న సవరణల వల్ల రైతులకు ఒక రేంజ్ లో మంచి జరుగుతుందని వాదించారు. మరి ఎందుకో.. ఆ మంచి చేయడం ఇప్పుడు ఇష్టం లేదేమో కానీ..

భూ సమీకరణ చట్టంలో సవరణల ఆలోచనను బీజేపీ వాళ్లు ఇంతటితో వదిలేస్తున్నారట. మళ్లీ ఈ బిల్లును చట్టసభల వద్దకు తీసుకొచ్చే ఉద్దేశం కానీ.. ఆర్డినెన్స్ ను జారీ ఆలోచన కానీ లేదని ప్రకటించేశారు. మరి మొత్తానికి ఏడాది కిందట ల్యాండ్ స్లైడ్ విక్టరీతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు ఈ విధంగా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎలాగూ రైతుల వ్యవహారం కాబట్టి.. ఉత్తరాదిన ఈ భూ సమీకరణ బిల్లు సవరణల విషయంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కాబట్టి… అన్నా హజారే వంటి వారు కూడా ఈ సవరణలను వ్యతిరేకించారు కాబట్టి.. చివరకు మోడీ ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గింది కాబట్టి.. మంచే జరిగిందని అనుకోవాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -