నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హతమార్చాడు. అమ్మ ప్రేమను మరిచి ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వట్ పల్లి మండలం పోతుల బోగుడా గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ (55) పేరుపై నాలుగు ఎకరాల భూమి ఉంది.
ఆమె కుమారుడు మురళి కొంత కాలంగా మద్యానికి బానిసగా మారాడు. రోజు తాగొచ్చి భూమిని తన పేరుపైన రాయాలని, మల్లమ్మపై ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలని అనేవాడు. దీనికి నిరాకరించడంతో తల్లిని చంపాలని పథకం వేశాడు.
ఈ క్రమంలో మురళి తన భార్య పిల్లలను పుట్టింటికి పంపాడు. మధ్యాహ్నం సమయంలో తల్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మురళి ప్రవర్తనపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డెడ్ బాడీకి శవపంచనామాని చేయడంతో అసలు విషయం బయటపడింది.
Also Read: సైబర్ నేరగాళ్ల దాడి.. రూ. 12 కోట్లు దారిమళ్లింపు