కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు వస్తున్న సమయంలో పట్టాలపై పడుకున్నాడు. గమనించిన వెంటనే స్పందించిన ప్రయాణికులు రుగున వెళ్లి బలవంతంగా లేపి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కించిన ఘటన ముంబైలో జరిగింది. కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయి, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్లాట్ ఫామ్ పై ఎంతో మంది ప్రయాణికులూ కనిపిస్తున్నారు. పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54 సంవత్సరాల నరేంద్ర దమాజీ కోటేకర్ గా గుర్తించారు. అతనికి రైల్వే అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH: A man was saved by Railway Protection Force (RPF) personnel & other passengers after he attempted to commit suicide at #Mumbai's Kurla railway station. (30.07.2018) (Source: CCTV) pic.twitter.com/6Yz5WB2Tsw
— ANI (@ANI) July 30, 2018