Friday, May 9, 2025
- Advertisement -

నాలుగైదు రోజుల్లో నైరుతి రుతు పవనాలు

- Advertisement -

ఇన్నాళ్లూ ఉక్క.. వేడితో అల్లాడిన వారికి ఇది నిజంగా ఓ చల్లని కబురు. అదే వాన కబురు. రోజుకో ప్రకటనతో ప్రజలను తికమకపెడుతున్న వాతావరణ శాఖ ఆఖరికి వాన కబురు మోసుకొచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఆ కబురు సారాంశం.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో నైరుతి రుతుపవనాలు త్వరగా రానున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశాలున్నాయి.

ఇక ప్రజల్ని భయపెడుతున్న ఎల్ నినో ప్రభావం కూడా అంతగా ఉండదని, మధ్య, దక్షిణ భారతదేశాల్లో 113 శాతం వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాల కారణంగా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని కూడా పేర్కొన్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -