Monday, April 29, 2024
- Advertisement -

ఉరుములు, మెరుపుల బీభత్సం.. 26 మంది మృతి..!

- Advertisement -

పశ్చిమబెంగాల్​ రాష్ట్రంలో భారీ విపత్తు సంభవించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. సాధారణంగా వర్షాకాలంలో సాధారణ వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇప్పటి వరకు దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. హుగ్లీ జిల్లాలో 11 మంది, ముర్షిదాబాద్‌లో తొమ్మిది మంది, బంకురా, ఈస్ట్‌ మిడ్నాపూర్‌, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

Also Read: మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

సోమవారం మధ్యాహ్నం వరకు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షం కురుస్తుందని ఎవ్వరూ గెస్​ చేయలేదు. కానీ సాయంత్రం మొదలైన వాన రాత్రి దాకా ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చనిపోయిన కుటుంబాలకు ప్రధాని సహాయనిధి కింద రూ. 2 లక్షల సాయం చేశారు. ఇక గాయపడ్డ వారికి రూ. 50 వేలు పరిహారం అందించారు.పూర్బా మెదినీపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నదియా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు 12 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వర్ష బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Also Read: తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -