Friday, May 9, 2025
- Advertisement -

ఓ వైపు ఎన్నికలు..మరోవైపు పెళ్ళిళ్ల కోలాహలం!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగాయి. కొంత విరామం తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఓ వైపు ఎన్నికల కోలాహలం మరోవైపు పెళ్లిళ్ల సందడితో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఎన్నికల ప్రచార రథాలు ఓ వైపు… మరోవైపు బాజా బజంత్రిల చప్పుళ్లలతో మా ఊరూవాడా మార్మోగిపోతున్నాయి.

ఎన్నికల ఖర్చు అభ్యర్థులకు తడిసి మోపేడవుతుండగా పెళ్లిళ్ల బిజిసెన్ కూడా కోట్లల్లో జరగనుంది. ఈ సీజన్ అంటే 11 రోజుల్లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 23 నుం డిసెంబర్ 15వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో ఫుల్ డిమాండ్ నెలకొంది.

గత ఏడాది ఇదే సీజన్ లో దాదాపు 32 లక్షల వివాహాలు జరగగా వాటి ద్వారా 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలియగా ఈ సీజన్‌లో గతేడాది కంటే మరో 6 లక్షల వివాహాలు అదనంగా జరుగుతుండటం 4లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ్టి నుండి ప్రారంభం అయిన వివాహాలను పరిశీలిస్తే ట్రేడ్ వర్గాల అంచనా నిజం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -