Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..కండీషన్స్ ఇవే

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రతీరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆదివారం మినహా ప్రతీరోజు నామినేషన్లను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

()జనరల్,బిసి అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు కాగా ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 5 వేల డిపాజిట్ చెల్లించాలి.

()నామినేషన్ వేసే వ్యక్తి తోపాటు మరో ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి.

()ఆర్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరా లు ఏర్పాటు,ర్యాలీలు,సభలు నిషేధం.

()ఆర్వో కార్యాలయం కు 100 మీటర్ల వరకు అభ్యర్థి 3 వాహనాలకు మాత్రమే అనుమతి.

()అభ్యర్థి నామినేషన్ వేసే ఒక్క రోజు ముందు రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ లో ఎన్నికల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఓపెన్ చెయాలి. ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా ను నామినేషన్ తో పాటు ఆర్వో కార్యాలయంలో సబ్‌మీట్ చేయాలి. ఎన్నికల కోసం ప్రతి ఖర్చు ఈ ఖాతా నుండే చేయాలి.

()ఇవాళ్టి నుండే అభ్యర్థి ఖర్చు ను లెక్క కట్టనున్న వ్యయ పరిశీలిలకులు.

ఇక నవంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా ఈనెల 13న నామినేషన్ల స్కృటీని ఉండనుంది. ఈనెల 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ చివరి గడువు కాగా 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్‌ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -