Friday, May 17, 2024
- Advertisement -

స్టూడెంట్ ని రేప్ చేసిన టీచర్ .. స్కూలు పగల గొట్టేసారు

- Advertisement -
mumbai teacher rapes his student

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిగా మారిన ఘటన ముంబైలో చోటుచేసుకోవడంతో అన్నెంపున్నెం ఎరుగని వయసులోనే విద్యార్థిని గర్భందాల్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే… నవీ ముంబైలో ఉంటున్న ఓ ప్రైవేటు స్కూలులో చదువుకుంటున్న 13 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ లో పనిచేసే టీచర్ ఒకరు కన్నేశాడు.

అతను బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి బాలికను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యుడు నాలుగు వారాల గర్భవతి అని తల్లికి తేల్చి చెప్పాడు.

దీంతో పూణేలో ఉద్యోగం చేసే భర్తకు విషయం వివరించడంతో ఆయన నెహ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసానికి వచ్చి, స్థానికులతో కలిసి స్కూలుపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, విషయం తెలుసుకుని, ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన దారుణంపై బాలిక ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ ఎలాంటి చర్య తీసుకోలేదన్న ఆగ్రహంతో వారు స్కూలుపై దాడికి దిగారు. ఈ ఘటనలో స్కూలు టీచర్ పరారీలో ఉన్నాడు. అతనిపై అత్యాచారం, పిల్లలపై దాష్టీకం వంటి కేసులు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.

Related

  1. సొంత కూతురిపై రేప్ చేసిన కసాయి తండ్రి
  2. సెల‌బ్రిటీ రేప్‌ చేసిన అభిమాని!
  3. హవ్వ : రేప్ డ్రామా ఆడి జైల్లో పెట్టించింది ..
  4. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -