రాజకీయ నాయకుడు ఒకడు ప్రభుత్వ అధికారి మీద చెయ్యి చేసుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటిది ఇప్పుడు నిజంగా జరిగింది. ఒక ఎమ్మెల్యే ఏకంగా డిప్యూటీ కలక్టర్ ని కొట్టేసాడు. మహారాష్ట్ర లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. కర్జాత్ నియోజకవర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ స్థానిక డిప్యూటీ కలెక్టర్ పై అభయ్ కల్గుద్కర్ పై చెయ్యిచేసుకున్నారు.
భూసేకరణ అంశంపై చర్చించేందుకు డిపూటీ కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే సురేశ్ లాడ్. ఈ సమయంలో రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అంశంపై డిప్యూటీ కలెక్టర్ – ఎమ్మెల్యే ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సమయంలో ఎమ్మెల్యే అయిన సురేశ్.. తన భూమికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ సమయంలో ఏమి జరిగిందో ఏమో కానీ.. ఉన్నట్లుండి సీరియస్ అయిన ఎమ్మెల్యే ఆ డిప్యూటీ కలెక్టర్ చెంపపై గట్టిగా కొట్టారు.
{youtube}v=Lc8fPMU0gA0{/youtube}