Friday, May 17, 2024
- Advertisement -

నేతన్నా నీకు సలాం పాటల సీడీ ఆవిష్కరణ

- Advertisement -

చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యల పై వారికి చైతన్యం కలిగించే నేపథ్యంలో మహంకాళి శ్రీనివాస్, గంజి శ్రీనివాస్ (కాన్సెప్ట్ డిజైనర్), గణేష్ లు రూపొందించిన “నేతన్నా నీకు సలాం” పాటల సీడీని 09-08-2016 మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు “తన్నీరు హరీష్ రావు” విడుదలచేశారు.

మంత్రి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ R. సత్యనారాయణ, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు CH. భద్ర, ప్రధాన కార్యదర్శి లీడర్ కళ్యాణ్, పద్మశాలి యువజనసంఘం అధ్యక్షులు ఏలె వెంకటనారాయణ, వైస్ MPP సురేందర్, సంగీత దర్శకులు సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చేనేత వర్గాల కార్మికులకు తమ ప్రభుత్వం అండదండలు ఎప్పుడూ ఉంటాయని, చేనేతవర్గాల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామనీ ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇదే కార్యక్రమంలో.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, హాండ్లూమ్ – పవర్ లూమ్ కార్మికులను విభజించాలనీ, వారికి వేరువేరుగా ప్రత్యామ్నాయ పథకాలను రూపొందించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి హరీష్ రావుకి అందజేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -