Friday, May 17, 2024
- Advertisement -

తిప్పలు తప్పవు..ఢిల్లీలో బాబుకు లభించని హామీ..?!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత పీకల్లోతులో మునిగిపోయాడని అంటున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్. బాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డీల్ లో ప్రత్యక్షంగా ఇన్ వాల్వ్ అయ్యాడని.. ఆయనను బ్రహ్మదేవుడు వచ్చినా రక్షించలేడని ఇది వరకే కేసీఆర్ తేల్చేశాడు. మరి బాబు కోసం బ్రహ్మదేవుడు దిగిరావడం, ఆయనను రక్షించడం ..

ఎలాగూ జరగవు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బాబును రక్షించే అవకాశాలున్నాయని అనుకొన్నారంతా. 

బాబుకు బీజేపీ మిత్రఫక్షమే కాబట్టి.. ఇప్పుడు ఆ పార్టీ వాళ్లు బాబును ఈ వ్యవహారం నుంచి బయటపడేయవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకొని వచ్చిన చంద్రబాబు కు మాత్రం అందుకు సంబంధించి స్పష్టమైన ఊరట లభించలేదని తెలుస్తోంది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని బాబు అంటున్నాడు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో  కేసీఆర్ ను కంట్రోల్ చేయమని అడగడానికే బాబు ఢిల్లీకి వెళ్లాడని ప్రచారం జరుగుతోంది.

బాబు ప్రధానితో సహా భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలందరినీ ఇదే విషయమై విజ్ఞప్తి చేసుకొన్నాడని.. అయితే ఎవరూ కూడా బాబుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అందరూ బాబు చెప్పినదాన్ని విని ఊరుకొన్నారని టాక్. ఈ వ్యవహారంలో బాబును ఇరికించడమే మంచిదని భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి అంతిమంగా తెలంగాణ ప్రభుత్వం బాబును ఈ వ్యవహారంలో అరెస్టు చేస్తుందా? చేయదా? అనేదాన్ని బట్టి.. దీనిపై కేంద్రం టోన్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -