చైనాలో పిల్లలు పుట్టడం లేదు. మీరు చదువుతున్నది వింతగా అనిపించినా.. ప్రస్తుతం అక్కడ ఇదే పరిస్థితి నెలకొన్నది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు పిల్లలు పుట్టకపోవడం.. చైనా ఆందోళన వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..! కొన్ని దశాబ్ధాల పాటు చైనా అవలంభించిన ‘వన్ చైల్డ్ పాలసీ’తో అక్కడ యువతరం జనాభా గణనీయంగా తగ్గి, వృద్ధ జనాభా భారీగా పెరిగింది.
దీంతో మానవ శక్తి తగ్గిపోవడతో.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి.. 2016లో “వన్-చైల్డ్ పాలసీ”లో మార్పులు చేసింది. అయితే, చైనా సర్కారు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పునరుత్పత్తి రేటు ఏకంగా మూడో వంతుకు పడిపోయిందని తాజగా గణాంకాలు చేబుతున్నాయి. చైనాలో పునరుత్పత్తి రేటు 30 శాతానికి పైగా పడిపోయింది. ఇలా తగ్గిపోవడం వరుసగా నాల్గో ఏడాది అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
ఇలా జరగడానికి బీజం చైనా సర్కారు తీసుకువచ్చిన వన్ చైల్డ్ పాలసీ సమయంలోనే పడింది. అయితే, ఆ తర్వాత మార్పులు తీసుకువచ్చిన ఫలితం పెద్దగా రాలేదు. దీనికి ప్రధాన కారణం చైనాలో కాలంతో పాటు వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పులే. ప్రస్తుతం దేశంలో జీవన వ్యయం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకున్న వారు పిల్లల్ని కనడానికి మొగ్గుచూపడం లేదు. దీంతో చైనాలో పిల్లల జనాభా తగ్గిపోతోంది. దీంతో 2025 నాటికి దేశంలో వృద్ధ జనభా 300 మిలియన్లకు చేరుకుంటుందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అరటాకులో భోజనం ఎందుకు మంచిదో తెలుసా?
ఆ హాట్ వీడియోలకు ఎందుకంత క్రేజ్..
ఇద్దరమ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ సభ్యులు!