Sunday, May 19, 2024
- Advertisement -

పాత 500 నోట్లు ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు!

- Advertisement -
old 500 note

డిసెంబర్ మూడో తేదీ నుండి పాత 500 రూపాయల కాగితాలను పెట్రోలు బంకులు, విమానాల్లో టికెట్ల కొనుగోలలో చెల్లవని తెలిసిందే. అయినప్పటికీ డిసెంబర్ 15 వరకూ ఈ నోట్లను కొన్ని చోట్ల వాడుకునే వెసలుబాటు ఉంది. ప్రభుత్వ ఆసపత్రుల్లోను.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై ఔషధాల దుకాణాల్లో.. రైల్వే టికెట్ కౌంటర్లలో.. ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థల్లో.. కో-ఆపరేటివ్ స్టోర్లలో పాత 500 నోట్లను వాడవచ్చు.

అంతే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే పాల బూత్ లు.. స్మశానాలు.. క్రిమేషన్ సెంటర్లలో.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలోని మ్యూజియాల్లో ప్రవేశం కోసం.. పోలీసులు విధించే జరిమానాలు, పన్నులు, మునిసిపల్, స్థానిక సంస్థలకు చెల్లింపులు.. ఇంకా నీటి, విద్యుత్ బకాయిలు, బిల్లులు తదితరాలను చెల్లించవచ్చు. ఇదే సమయంలో ముందస్తు చెల్లింపులను మాత్రం అనుమతించరు.

Related

  1. 2వేల నోటు సీక్రెట్ బయట పెట్టిన కేసీఆర్!
  2. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  3. 2000 నోటు నకిలీనోటు అవునో కాదో ఇలా గుర్తించండి!
  4. ఓటు వేసేందుకు నోటు తీసుకోవడం అవినీతి కాదట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -