Monday, April 29, 2024
- Advertisement -

జియోకు పోటీగా …ప‌తంజ‌లి సిమ్ కార్డులు..ఆఫర్స్ అదుర్స్

- Advertisement -

అతి తక్కువ కాలంలో 50 నుంచి ఏకంగా వెయ్యికి పైగా కన్జ్యూమర్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టి పతంజలి ఆయుర్వేద్ సంస్థ సంచలనం సృష్టించింది. కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్‌లో విజయవంతమైన పతంజలి.. టెలికాం సెక్టార్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం చేసుకొని స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌కార్డులను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ భాగస్వామ్యంలో ఈ సిమ్‌ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్‌ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్‌ బాబా చెప్పారు. పతంజలి సంస్థ అందించే సిమ్‌కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్‌తో పాటు 100ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుందని పేర్కొంది.

ప‌తంజ‌లి సిమ్ కార్డు తీసుకుంటే బంఫ‌ర్ ఆఫ‌ర్స్‌కూడా ప్ర‌క‌టించింది. పతంజలి సంస్థ అందించే సిమ్‌కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చ అంతే కాదండోయ్ ఇది మాత్రమే కాదు రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమాను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పింది.

దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 5లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సమ్‌రాధి కార్డును పొందవచ్చని యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌ గార్గ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -