Thursday, May 2, 2024
- Advertisement -

దేశ్ బచావ్ పేరుతో పవన్ ఆల్బమ్!

- Advertisement -
Pawan kalyan JanaSena Poster

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా పోరడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ ‘దేశ్ బచావో’అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంకో పోస్టర్ లో ఆవేశంతో పిడికిలి బిగించిన పవన్ ఉన్న ఫోటోను రిలీజ్చేశారు. ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వ్యాక్యాల్ని తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

‘‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో.. ధైర్యంలో చల్ల లేకపోతే.. అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవటానికి నిర్ణయించుకుంటె.. ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి..’’ అంటూ భావోద్వేగం కనిపించేలా ట్వీట్ చేశారు. ఇంకో ట్వీట్ లో ‘‘మేము పూలగుత్తులకు వ్రేలాడే వసంత రుతువులం కాదు.. వట్టి మనుష్యులం. దేశం మాకు గాయాలిచ్చినా నీకు మేం పువ్వులిస్తున్నాం.

ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా.. యోచించు ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు’’ అని పేర్కొన్నారు. ఎందరో భవిష్యత్ తరాల కోసం తమ ప్రాణాలను వదిలేసిన విషయంను పవన్ గుర్తు చేసిన విధనం చూస్తే.. పవన్ కళ్యాణ్ లో ఉద్యమ నేత పూర్తిస్థాయిలో బయటకు వచ్చేసినట్లు చెప్పాలి. ఎలాగైన ఏపీ ప్రత్యేక హోదా తీసుకరావడానికి పవన్ ప్రయత్నం గొప్పదిగా కనిపిస్తోంది. 

Related

  1. పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌ నడిపిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  3. ” పవన్ కళ్యాణ్ రోజుకొక మాట మాట్లాడకు “
  4. పవన్ సరసన యాంకర్ అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -