Wednesday, May 7, 2025
- Advertisement -

భార‌తీయుల ర‌క్తం మ‌రుగుతోంది…ప్ర‌తీకారం త‌ప్ప‌దు…ప్ర‌ధాని మోదీ..

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్ర‌దాడిపై యావ‌త్ దేశ‌మంతా ఖండించింది. దేశంలో ఉన్న ప్ర‌ధాన రాజ‌కీయాపార్టీల నాయ‌కులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉగ్ర‌వాదుల‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తున్న పాక్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. జ‌వాన్ల‌పై దాడి చేసి పెద్ద త‌ప్పుచేశార‌ని…దానికి భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఉగ్ర సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో శుక్రవారం ఆయన నివాళులర్పించారు.

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, జవాన్ల సాహసంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. జరిగిన దారుణంతో అందరి రక్తం మరుగుతోందని చెప్పారు. ఇది అత్యంత సున్నితమైన సమయమని… ఈ పరిస్థితుల్లో అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. దేశం మొత్తం సంఘటితంగా ఉండాలని చెప్పారు.

ఇండియాను అస్థిరపరచాలని పొరుగు దేశం భావిస్తున్నట్టైతే, ఆ ఆలోచనను విరమించుకోవాలని… అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. ఉగ్ర‌వాద దాడి జ‌రినిన త‌ర్వాత ఢిల్లీలో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. అమరుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -