పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో రచ్చ రచ్చ.. పాకిస్తాన్ నిర్ణయమే కారణమా ?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ తీసుకున్న ఓ నిర్ణయంపై పిఒకే ( POK ) లో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నిజానికి పిఒకే పై పాకిస్తాన్ ఆదిపత్యం చెలాయిస్తున్నప్పటికి స్వయం పరిపాలన రాష్ట్రంగా ఉంది. దీనిపై పూర్తి పట్టు సాధించేందుకు ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఎప్పటినుంచో గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎక్కువ శాతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న పిఒకే పాక్ ప్రధాన మంత్రి నేతృత్వంలోనే పరిపాలన సాగిస్తోంది.

ఇక తాజాగా పాక్ ప్రభుత్వం పిఒకే విషయంలో రాజ్యాంగ హోదాను సరిచేసే క్రమంలో 15 వ రాజ్యంగ సవరణ చేయాలని నిర్ణయంచింది. అయితే గతంలో పాక్ రాజ్యాంగం ప్రకారం 13 వ సవరణలో పిఒకే కు కొన్ని స్వయం ప్రతిపాదక అంశాలను పొందుపరిచింది. పిఒకే విషయంలో అసెంబ్లీ చట్టాలు చేయడం, అక్కడ విధించే కార్పొరేట్ పన్ను మరియు ఇతర పన్నులు వంటి వాటి గురించి 13వ సవరణలో ప్రస్తావించారు.

అయితే తాజాగా పాకిస్తాన్ ఈ సవరణను ఉప్సంహరించుకొని, 15 వ సవరణను ఆమోదించేందుకు సిద్దమైంది. ఈ 15వ సవరణ ద్వారా పిఒకే లో న్యాయ మూర్తులను ఎన్నుకునే విధానంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషన్, ఇతర అత్యవసర నిబంధనలు వంటివి అన్నీ పాకిస్తాన్ అధీనంలోకి వెళ్లిపోతాయి. దీంతో పాకిస్తాన్.. పిఒకే పై పూర్తి ఆదిపత్యం చలాయిస్తోందని అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. అయితే పిఒకే విషయంలో పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also Read

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

ఇజ్రాయెల్, పాలస్తిన భీకర యుద్దం.. అసలేం జరుగుతోంది !

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

Related Articles

Most Populer

Recent Posts