ఒకప్పుడు పాక్ జండాలు ఎగిరినా చోటే.. ఇప్పుడు ఇండియా జెండాలు !

మనదేశంలో కాశ్మీర్ కు సంభంధించి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మన దేశ స్వాతంత్ర్యానికి ముందు ఇండిపెండెంట్ దేశంగా ఉన్న జమ్ము కాశ్మీర్..మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని నింబంధనల మేరకు మనదేశంలో భాగమైంది. అయినప్పటికి కాశ్మీర్ కేంద్రంగా భారత్, పాకిస్తాన్ మద్య జరిగిన యుద్దంలో భారత్ పైచేయి సాధించినప్పటికి కాశ్మీర్ లోని కొంత భాగం పాకిస్తాన్ వశం అయింది. దానినే ఇప్పుడు ” పాక్ ఆక్రమిత కాశ్మీర్ ” పిలువబడుతోంది. ఇక అప్పటినుంచి కాశ్మీర్ పై పట్టు సాధించేందుకు నిత్యం అక్కడ అల్లర్లు సృష్టిస్తూ, మతకలహాలు రేపెడుతూ, ఇండియా కు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు పన్నుతూ వచ్చింది పాకిస్తాన్.

అయితే స్వయం ప్రతిపదికన ఉన్న జమ్ము కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ ను రద్దు భారత ప్రభుత్వం 2019 ఆగష్టు 5న రద్దు చేయడంతో జమ్ము కాశ్మీర్ పై చర్యలకు అడ్డుకట్ట పడింది. దాంతో నిత్యం అల్లర్లకు కేంద్ర బిందువు అయిన కాశ్మీర్ లో అప్పటినుంచి శాంతి వాతావరణం నెలకొంది. ఒకప్పుడు నిత్యం పాక్ జెండాలే కనిపించిన కాశ్మీర్ లో ప్రస్తుతం మన జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక ఈ ఏడాది 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ” హర్ ఘర్ తీరంగా ” నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీనగర్ దాల్ సరస్సు వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్వర్యంలో తీరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ” గతంలో జమ్ము కాశ్మీర్ లో కేవలం పాకిస్తాన్ జండాలు మాత్రమే ఎగిరేవని, ప్రస్తుతం పరిస్థితి మారిందని ఇప్పుడు త్రివర్ణ పతాకం ఎగురుతోందని ” అన్నారు. అంతే కాకుండా ప్రజల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని, ఇంకా పూర్తి స్థాయిలో మార్పు రావాల్సి ఉందని మనోజ్ సిన్హా చెప్పుకొచ్చారు.

Also Read : ఆగష్టు 14 భారతావని కి రక్తపు మచ్చ !

Related Articles

Most Populer

Recent Posts