Friday, May 17, 2024
- Advertisement -

మ‌ళ్లీ మొద‌టికి రానున్న కేసు…. బాబు ఎత్తుకు పైఎత్తులు

- Advertisement -

స‌దావ‌ర్తి భూముల వేలానికి సంబంధించిన కేసులో బాబు ఆయ‌న బ్యాచ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. భూముల వేలం ప్ర‌క్రియ ముగిసిపోయింద‌నున్న స‌మ‌యంలో అది మ‌రోసారి మొద‌టికి రానుంది. ఆడ్డ‌దారుల్లో వంద‌ల కోట్లు విలువ చేసె భూమాల‌ను ద‌క్కించుకున్న ప‌చ్చ బ్యాచ్‌కి ఇది పెద్ద షాకే న‌ని చెప్పాలి.

మొద‌ట చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం ఎంత స్థాయిలో మోసానికి పాల్పడిందో చాలా స్పష్టంగా నిరూపణ అయింది. గ‌తంలో స‌దావ‌ర్త స‌త్రానికి సంబంధించి 83.11 ఎకరాల భూమిని త‌న అనుయాయుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టు ద్వారా అడ్డుకున్నారు. త‌ర్వాత ఏంజ‌రిగింద‌నేది అందిరికి తెలిసిందే.

మ‌రో సారి ఓపెన్ వేలం వేయాల‌ని కోర్టు చెప్ప‌డంతో ఆభూముల‌ను ద‌క్కించుకొనేందుకు అధికార‌పార్టీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇత‌ర నేత‌లు చ‌క్కంతిప్పి 70.30 కోట్లుకు సొంతం చేసుకున్నారు. దీనిపైన అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితె ఇప్పుడు తాజాగా బాబు ఆయ‌న బ్యాచ్‌కు పెద్ద షాక్ త‌గిలింది.

ఈ వేలాన్ని కూడా రద్దుచేసి.. ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన ప్రతివాదిగా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ ద్వారా వేలం నిర్వహింపజేసి.. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి దఖలు చేసేలా చూడాలని కోరుతూ.. ఒక పిల్ దాఖలు కానుంది. ఏ రకంగా ఇందులో అక్రమాలు చోటుచేసుకుని ఉన్నాయో నిరూపిస్తూ… కొందరు ప్రెవేటు వ్యక్తులు హైకోర్టులో పిల్ వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఒకసారి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వమే మళ్లీ వేలం నిర్వహించినందున.. ఎంత ఎక్కువ ధర పలికితే.. అంతగా తమ అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో.. తక్కువ ధరనే నిర్ణయించారని ఫిటిష‌న్ వేయ‌ద‌లుచుకున్క‌న వారి ప్ర‌ధానం ఆరోపణ.

ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా థర్డ్ పార్టీ ద్వారా.. సదావర్తి భూములన్న ప్రాంతంలో రిజిస్టర్ వేల్యూ ప్రకారం కనీస ధర నిర్ణయించి.. ఆ పైన పాడుకునేలా వేలం పాట మళ్లీ నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో పిల్ వేయబోతున్నారు. ఇదే జరిగి.. కోర్టుకూడా ఈ వాదనతో ఏకీభవిస్తే గనుక.. ప్రభుత్వానికి కచ్చితంగా వందల కోట్ల లాభం చేకూర‌డంతోపాటు…బాబు ఆయ‌న ప‌చ్చ బ్యాచ్‌కు బ్యాండ్ మోగిన‌ట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -