Saturday, April 27, 2024
- Advertisement -

9మందితో బీజేపీ ..56 మందితో కాంగ్రెస్‌ థర్డ్ లిస్ట్

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో దూకుడు పెంచాయి అధికార, విపక్ష పార్టీలు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ రెండు లిస్ట్‌లను రిలీజ్ చేయగా తాజాగా ఒకేరోజు 9 మందితో బీజేపీ థర్డ్ లిస్ట్, 56 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది.

ఈ తొమ్మిది స్థానాలూ తమిళనాడులోవే కాగా మాజీ గవర్నర్ తమిళి సై చెన్నై సౌత్ నుండి పోటీ చేస్తుండగా , తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు కోయంబత్తూర్‌, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌కు నీలగిరి(ఎస్సీ), కేంద్ర మాజీ మంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి స్థానాలు కేటాయించారు. ఇక మూడో జాబితాతో కలిపి బీజేపీ 275 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఇక కాంగ్రెస్ 56 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.ఇందులో తెలంగాణ నుండి 5గురికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్‌, పెద్దపల్లి వంశీకృష్ణ,చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డి,మల్కాజ్‌గిరి నుండి పట్నం సునీతామహేందర్‌రెడ్డి,నాగర్‌కర్నూలు నుండి మల్లు రవికి టికెట్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో 17 స్థానాలకు గానూ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మూడో జాబితాలో కర్ణాటక(17), గుజరాత్‌(11), పశ్చిమ బెంగాల్‌(8), మహారాష్ట్ర(7), రాజస్థాన్‌(6), తెలంగాణ(5), అరుణాచల్‌ప్రదేశ్‌(2), పుదుచ్చేరిలో ఒక సీటుకు అభ్యర్థులను ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -