Thursday, May 8, 2025
- Advertisement -

మ‌రో ఘ‌నత సాధించిన రామోజీ ఫిల్మ్‌సిటీ

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు, ప‌ర్యాట‌కుల‌ను విప‌రీతం ఆక‌ర్షిస్తున్న ప్రాంతం రామోజీ ఫిల్మ్‌సిటీ. హైద‌రాబాద్ శివారున కొలువైన ఈ ఫిల్మ్ సిటీ ఓ ప్ర‌త్యేక‌త చాటుకుంటోంది. ఇప్పుడు ఈ ఫిల్మ్‌సిటీ మ‌రో ఖ్యాతి గ‌డించింది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఫిల్మ్‌సిటీగా రికార్డు పొందింది. సినిమాల నిర్మాణానికి సకల సౌకర్యాల నిలయంగా నిలుస్తున్న రామోజీ ఫిల్మ్‌సిటీ మరో ఘనతను త‌న ఖాతాలో వేసుకుంది.

సినిమా తీయ‌డానికి ఉన్న అనుకూల ప‌రిస్థితులు పర్యావరణ హితంగా అంతర్జాతీయస్థాయిలో ఒకేచోట అందిస్తోందంటూ రామోజీ ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందింది. ‘లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ రామోజీ ఫిల్మ్ సిటీని గుర్తించింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును శనివారం ఫిల్మ్‌సిటీలో ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ భారత అధ్యక్షుడు సంతోశ్ శుక్లా ఆ రికార్డు పత్రాన్ని అందజేశారు. ‘‘హాలీవుడ్‌, బాలీవుడ్‌లలోని చిత్ర నిర్మాణ ప్రదేశాలన్నింటినీ పరిశీలించాం. ఆర్కే స్టూడియో వంటి సంస్థలకు గుర్తింపు ఇచ్చాం. కానీ, రామోజీ ఫిల్మ్‌సిటీలో సుందర ప్రదేశాలు, మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యంపై ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ముచ్చ‌ట‌ప‌డింది. ఇక్కడ ఏ పనైనా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అంకితభావంతో చేస్తున్నారని అని శుక్లా పేర్కొన్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీ ప‌ర్యాట‌కంగాను ఆక‌ర్షిస్తోంది. ఈ ఫిల్మ్‌సిటీలో బాహుబ‌లి రెండు సినిమాలు దాదాపు ఐదేళ్ల పాటు తీశారు. అంత అద్భుత దృశ్య‌కావ్యం తెర‌కెక్కించింది ఈ ఫిల్మ్‌సిటీలోనే. తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో సినిమాల‌న్నీ ఫిల్మ్‌సిటీలో తీసేంత స్థాయి ఏర్ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -