- Advertisement -

చంద్రబాబుతో రాయ’బేరం’

- Advertisement -

ప్రత్యేకహోదా, విభజన హామీలు నెరవేర్చకుండా, మిత్రధర్మాన్ని కూడా మరిచిపోయి మోసం చేసిన మోడీ సర్కార్ పై చంద్రబాబు తిరుగుబాటును మొదట్లో బీజేపీ సహా ఎన్డీఏ కూటమి సభ్యులు తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఏనాడైతే చంద్రబాబు ఎన్డీఏకి గుడ్ బై చెప్పేశారో…ఆనాటి నుంచే మోడీ, అమిత్ షా తీరును ఎండగడుతున్నారు. ఓ సీనియర్ సీఎంగా 29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి న్యాయం చేయాలని బతిమాలినా పట్టించుకోకుండా అహంకారంతో వ్యవహరించి, తన విన్నపాలు బుట్టదాఖలు చేసి అవమానించారని సన్నిహితుల వద్ద చంద్రబాబు చెప్పుకున్నారు. అధికారం చేపట్టాక అహంకారంతో వ్యవహరిస్తున్న మోడీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి, 2019లో మోడీ తప్ప ఎవరు ప్రధాని అయినా ఫర్వాలేదు..అని చాపకిందనీరులా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

ఇంటిలిజెన్స్ రిపోర్టుల ద్వారా బాబు కదలికలను నిశితంగా గమనిస్తున్న మోడీ, అమిత్ షా అతడితో అనవసరంగా పెట్టుకున్నామేమో..! అనే సందిగ్ధంలో పడిపోయారు. ఇప్పటికే ఎల్ కే అద్వాణీ, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు అదే విషయంపై మోడీ, అమిత్ షాకి క్లాసులు పీకారు. దశాబ్దాల నుంచి చంద్రబాబు ఎన్డీఏ, బీజేపీకి నమ్మకమైన మిత్రుడు. అలాంటి చంద్రబాబుని దూరం చేసుకుని, చాలా తప్పు చేశారని తలంటారు. చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీలతో జట్టుకట్టి, బీజేపీకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా చేస్తాడని, అతడి ఇగోని దెబ్బతీసి తప్పు చేశారని హెచ్చరించారు. వాళ్లు హెచ్చరించినట్లే చంద్రబాబు కాంగ్రెస్ సహా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, బీజేపీని ద్రోహిగా ప్రజలముందు నిలబెడుతున్నాడు. దీంతో ఏపీలో టీడీపీని మట్టికరిపిద్దామని తాము తలిస్తే…కేంద్రంలో బీజేపీనే మట్టికరిపించే వ్యూహం జరుగుతోందని చాలా తొందరగానే గ్రహించిన కమలనాథులు ఇప్పుడు బాబుతో రాజీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ముకేష్ అంబానీని రాయబారానికి పంపారు. మోడీతో స్నేహం ఉండకపోయినా ఫర్వాలేదు, వైరం వద్దు అని, ఇతర పార్టీలతో కలిసి యాంటీ బీజేపీ ఫైట్ చేయవద్దని మోడీ దూతగా అంబానీ చెప్పారు. ఆ తర్వాత నేరుగా అమిత్ షా రామోజీరావుతో భేటీ అయి ఇదే విషయాన్ని విన్నవించుకున్నారు. చంద్రబాబుకు చెప్పి, బీజేపీయేతర ఫేట్ నిలిపేయాలని రాజీకుదర్చాలని చర్చలు జరిపారు. ఇప్పుడు గవర్నర్ నరసింహన్ వంతు వచ్చింది. గత కొంతకాలంగా చంద్రబాబు గవర్నర్ మధ్య సానుకూల భావాలు లేవు. ఎడమొహం పెడమొహంగా వీరిద్దూర అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ విచ్చేసిన నరసింహిన్ చంద్రబాబుతో ఏకంగా రెండున్నర గంటలకు పైగా ఏకాంత చర్చలు జరిపారు. ఈ ముఖాముఖి భేటీలో గవర్నర్ మోడీ దూతగా వచ్చి గతంలో అంబానీ, అమిత్ షా చేసిన రాజీ ప్రయత్నాలే మళ్లీ చేశారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రాజకీయాలు చేయవద్దని, మోడీ మాటగా బాబుకు చెప్పుకొచ్చారు.

టీడీపీ ఇండివిడ్యుయల్ గా పోరాటం చేసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో కలసి యాంటీ బీజేపీ ఫైట్ వద్దని మోడీ, షా దూతగా వివరించారు. కానీ చంద్రబాబు ఆ రాయబారాన్ని తిరస్కరించారు. ఏపీకి చేసిన అన్యాయం, మోసంపై ప్రజలు రగిలిపోతున్నారని, ప్రత్యేకహోదా ఇచ్చేవారికి తమ మద్దతని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కృషి చేయడంలో ఎలాంటి అనుమానాలు తమకు లేవని తేల్చి చెప్పేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎవరిస్తారో వారికే 2019లో ప్రధాని పట్టం కట్టేందుకు కృషి చేస్తామని చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. మొత్తానికి కోరికోరి కెలుక్కున్న మోడీ, షా ఇప్పుడు వరుస రాయబారాలతో బాబుని మళ్లీ దువ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అంటారు…ఏదైనా పోగొట్టుకున్నాకే విలువ తెలుస్తుంది అని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -