Friday, May 9, 2025
- Advertisement -

చిన్న‌తెర‌పై అపర కుబేరుడు.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌

- Advertisement -

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాద‌రణ పొందిన టీవీ సీరీస్‌ ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’. ఈ టీవీ సిరీస్‌ను ఎంద‌రినో ఆక‌ర్షించి మిలియ‌న్ల మంది చూశారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో వేలు, ల‌క్ష‌ల కోట్ల‌కు అధిప‌తిగా ఉన్న ఓ ప్రముఖ బిజినెస్ మేన్ అతిథి పాత్రలో నటించనుండ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అపర కుబేరుడు. పైగా మంచి వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌ప‌చంలోనే అత్యంత పెద్ద కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉంది. ఆయ‌న ఈ షోలో అతిథి పాత్రలో క‌నిపిస్తున్నార‌ట‌. అయితే ఆయన షోలోనూ తన నిజ జీవిత పాత్ర బిల్‌గేట్స్‌గానే కనిపించనున్నారట. ఈ సిరీస్ ప్రారంభించే కార్యక్రమంలో బిల్‌గేట్స్‌ ముఖ్య అతిథిగా కనిపించనున్నారు.

బిల్‌గేట్స్ తో పాటు ఈ షోలో స్టీఫెన్‌ హాకింగ్స్‌, స్టాన్‌లీలు కూడా అతిథులుగా కనిపించనున్నారని స‌మాచారం. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రసారం కానుంది. బిల్‌ గేట్స్‌ 2001లోనూ ఫ్రైసర్‌ అనే టీవీ షోలో నటించారు. ఇప్పటికే ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’ పదకొండు సీజన్‌లు పూర్తి చేసుకుని 12వ సీజన్ ఈ మార్చిలో ప్రారంభం కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -