నదులు ప్రాణి కోటికి జీవణా ధారం. నదులే అన్నిటికీ మూలం. నదులు లేని ప్రపంచం ఊహించలేం. ఒక్కోసారి నదులు ఎండిపోవడం గమనిస్తూనే ఉంటాం. సాదారనంగా వాణా కాలంలో ప్రవహించిన కొన్ని నదులు ఎండాకాలంలో ఒట్టి పోతుంటాయి. ఇది ఎక్కడైనా సర్వసాధారనం.కానీ వేల సంవత్సరాలనుంచి ప్రవహిస్తున్న ఆ నది ఏకంగా నాలుగు రోజుల్లోనే మాయమయ్యింది. నాలుగు రోజుల్లో నదిమాయమవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..మీరు విన్నది నిజమే…అది ఇండియాలో కాదులేండి కెనడాలో…
మనుసులు చేస్తున్న తప్పిదాలకు ప్రకృతి బలైపోతోంది. ప్రాణులకు జీవణా ధారమైన నదులుకూడా ఎండిపోతున్నాయి. కెనడాలో వందల సంవత్సరాలనుంచి ప్రవహిస్తున్న నది కేవలం నాలుగు రోజుల్లోనే మాయమయ్యింది. దీనికి కారనం మనం చేస్తున్న తప్పిదాలే.జలకళతో విలసిల్లే ఆనది ఇప్పుడు వట్టిదైపోయింది. వాతావరణ మార్పులే ఇందుకు కారణమనీ…. భూతాపం పెరిగి హిమనీనదం వేగంగా కరగడం వల్లే ఇలా జరిగిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. మామూలుగా కెనడాలో ని కస్కవుల్ష్ హిమనీనదం మెల్లగా కరిగి ఆనీరంతా స్లిమ్స్ నదిలో కలిసేది.దీని వల్ల ఎల్లప్పుడు నదిలో నీరు ప్రవహించేది. స్లిమ్స్ నది క్లుయేన్ అనే మరోనదితోకలసి ఆనీరంతా బేరింగ్ సముద్రంలో కలిసేది.కానీ 2016 మే 26 నుంచి 29 మధ్య హిమానీ నదం వేగంగా కరిగిపోయింది. ఇంత కాలం హిమనీనదం అడ్డంగా ఉండటం వల్ల నీరు స్లిమ్స్ నదిలోకి వెల్లేది,ఇప్పుడు ఒక్కసారిగా హిమనీనదం కరిగిపోయి తగ్గు ఏర్పడటంతో నీరంతా వ్యతిరేక దిశలో పయానిస్తూ పసిఫిక్ సముద్రంల కలిసింది.
అమెరికాలోని యూనిర్శిటీ ఆప్ వాషింగ్టన్‌లో పనిచేసే, కెనడాకు చెందిన డేనియల్ షుగర్ నేతృత్వంలో పరిశోధకుల బృందం గతేడాది ఆగస్టులో అక్కడకు వెల్లి పరిశోధించి విషయాన్ని కనిపెట్టారు. అభివృద్ది పేరుతో మనం చేసే తప్పిదాలకు ఎండిపోయిన ఈనదే సాక్ష్యం.
Related