Sunday, June 16, 2024
- Advertisement -

ఈసీ అన్ని వీడియోలను రిలీజ్ చేయాలి!

- Advertisement -

ఈసీకి చిత్తశుద్ధి ఉంటే ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను రిలీజ్ చేయాలన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈసీకి ప్రశ్నలు సంధించారు సజ్జల.

టీడీపీ నేతలు నాగేశ్వరరావు, బూత్ ఏజెంట్ నర్సింహారావు ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆరోపించిన సజ్జల.. పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా.. ఆ వీడియో సరైనదా? కాదా? అన్నది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది? అని ప్రశ్నించారు.

మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగితే కేవలం ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తారని ప్రశ్నించారు. అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగింది? అన్నది వెలుగులోకి వస్తుందని తెలిపారు.సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ఈసీ చెప్పాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -