Friday, May 17, 2024
- Advertisement -

సంపూర్ణేష్‌బాబు అరెస్టు చేసిన పోలీసులు… ఎందుకో తెలుసా..?

- Advertisement -
sampoornesh babu arrested

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లో యువత చేపట్టిన ఆందోళనకు యువ‌త‌ తో పాటు.. విప‌క్ష పార్టీలు అలాగే.. ప‌లువురు సినిమా రంగం చేందిన ప్ర‌ముఖులు కూడా డైరెక్టర్‍గానో.. సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్టుగానో త‌మ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ నెపథ్యంలో తెలంగాణ‌కు చెందిన హీరో.. బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు కూడా ఈ ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తు తెలిపేందుకు విశాఖ వెళ్ళారు.

ఈ ప్ర‌త్యేక హోదా నిర‌స‌న పోరాటానికి తన మద్దతు ఇవ్వడానికి నిన్న విశాఖకు చేరుకున్నాడు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని సంపూ ఫైర్ అయ్యారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగే పోరాటానికి తన మద్దతు ఇస్తున్నట్లు సంపూ చెప్పారు. అయితే సంపూను అనూహ్య రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో యువత భగ్గుమంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తెలంగాణ నుంచి వచ్చి మద్దతు ఇస్తున్న సంపూను అరెస్ట్ చేయడం ఎంతవరకూ న్యాయమని ఏపీ యువత అంటుంది.

అరెస్ట్ గురించి మీడియా ప్రశ్నించినా మాట్లాడటానికి సంపూ విముఖత వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంపూర్ణేష్‌బాబు తోటి తెలుగు రాష్ట్ర‌మైన ఏపీకి ప్ర‌త్యేక హోదా పోరాటానికి విశాఖ రావ‌డంపై అక్క‌డి వారు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ కి సంపూ సపోర్ట్
  2. రజనీ చిత్రంపై సంపూ సెటైర్ వేసాడు
  3. సంపూకి ఘోర అవమానం..!
  4. బాలల హృదయాల్ని దోచుకున్న సంపూర్ణేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -