Saturday, May 3, 2025
- Advertisement -

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..

- Advertisement -

సెల్పీ దిగాలన్న సరదా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. గోల్కొండ కోటపై సెల్ఫీలు తీసుకుంటుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో హుటాహుటిన నగరంలోని ఓ ప్రేవేటు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన రాజమణి, సింగం స్వామిల కుమారుడు రంజిత్ (25) హైదరాబాద్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూనే జాబ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గోల్కొండ కోటను చూడడానికి గురువారం తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు.

కోట అందాలను ఫోన్లో బందించే క్రమంలో సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో నగరంలోని ఓ ప్రేవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతున్న రంజిత్ ఆదివారం చనిపోయాడు. దీంతో ఎన్గల్ గ్రామంలో విషాదం ఛాయలు అలముకున్నాయి.

పేగు బంధం మరిచిన తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి…

వీరుడికి ఘన నివాళీ

మైనర్‌ బాలిక‌పై‌ ఆటోడ్రైవర్ల అఘాయిత్యం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -