Saturday, April 20, 2024
- Advertisement -

వీరుడికి ఘన నివాళీ

- Advertisement -

తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన ఆర్మీ జవాన్, తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం బెంగళూరు నుంచి సాయి తేజ పార్థివ దేహాన్ని స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడు తరలించారు.

లాన్స్‌ నాయక్‌ మృత దేహాన్ని ఎగువరేడుకు తరస్తుండగా అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తును అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్‌పై పూలు జల్లుతూ నివాళులు అర్పించారు. అనంతరం ఎగువరేగడులో తన నీవాసంలో సాయి తేజ పార్థివ దేహాన్ని ఉంచారు. సాయితేజ పార్థివ దేహాన్ని చూడగానే తన భార్య సృహకోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తనను అక్కడి నుంచి తీసుకెళ్లారు.

సాయితేజ పార్థివ దేహాన్ని తరలిస్తుండగా తన తండ్రి పార్థివ దేహాంపై పడి తన కుమారున్ని తీసుకెళ్లొదంటూ బోరున విలపించారు. దీంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంచనాలతో సాయితేజ అంత్యక్రియలు జరిగాయి.
అమరుని పార్థివ దేహంపై ఉంచిన జాతీయ పతాకాన్ని ఆర్మీ అధికారులు సాయితేజ భార్యకు అందజేశారు. గ్రామస్తులు సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు.

పేగు బంధం మరిచిన తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి…

పెరుగుతున్న ఒమైక్రాన్‌ కేసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -