పేగు బంధం మరిచిన తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి…

- Advertisement -

పేగు బంధాన్ని మరిచిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో రాజేంద్రనగర్‌ పరిధిలో కలకలం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌కు చెందిన స్వాతి(35) సాయికుమార్‌ బార్యా«భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రేయ (3), తన్విక్‌ (5) ఉన్నారు. వీరు స్థానికంగా పోట్వీ కాలనీలోని శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఇద్దరు కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులే.

సాయి కుమార్‌కు అప్పులుబాగా అయ్యాయి. బ్యాంకులోన్, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అవితీర్చక పోవడంతో అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర ప్రెస్టేషన్‌కు గురయ్యాడు. దీంతో తరచుగా భార్యతో గొడవ పడేవాడు. కాగా శనివారం కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాక ఇద్దరు పిల్లలను చంపిన స్వాతి తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

- Advertisement -

తన భర్త ఒక సైకో అని నిత్యం అనుమానించి వేధించేవాడని, సోదరులతో మాట్లాడినా అక్రమ సంబంధం అట్టగట్టేవాడని సూసైడ్‌ నోట్‌లో రాసింది. భర్త వేధింపులు భరించలేకనే తాను చనిపోతున్నానని నోట్‌లో తెలిపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

మైనర్‌ బాలిక‌పై‌ ఆటోడ్రైవర్ల అఘాయిత్యం..

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వారిపైనే ఎక్కువ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -