Wednesday, May 22, 2024
- Advertisement -

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..శ‌తాబ్ధిరైళ్ల‌లో ప్ర‌యాణం ఇక‌ శుల‌భ‌రం

- Advertisement -

అధిక ఛార్జీల కారణంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణం చేయాలంటే చాలామంది మధ్యతరగతి ప్రయాణికులు వెనుకాడేవారు. కానీ, ఈ ఛార్జీలు భారీగా తగ్గనున్నాయి. . చార్జీలను త్వరలో తగ్గించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ ప్రస్తుతం పనిచేస్తోందన్నారు. ఎక్కువ రద్దీలేని మార్గాల్లో నడుస్తున్న 25 శతాబ్ది రైళ్లలో చార్జీల్ని తగ్గించే అవకాశమున్నట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా 45 వరకు శతాబ్ది రైళ్లున్నాయి. గతేడాది ఢిల్లీ–అజ్మీర్, చెన్నై–మైసూరుల మధ్య చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. బస్సులకు సమానంగా చార్జీలు తగ్గించడంతో ఈ మార్గాల్లో రైల్వే ఆదాయం 17 శాతం, ప్రయాణికుల బుకింగ్స్‌ 63 శాతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ చార్జీలు తగ్గించడంతోపాటు రైలు సర్వీసుల లే ఓవర్ టైం తగ్గించి 100 కొత్త రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 25 నూతన రైళ్లు ప్రారంభించగా, ఈ ఏడాదిలోపు మరో 75 రైళ్లు ప్రారంభం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -