Thursday, May 8, 2025
- Advertisement -

భారత్ మాతాకీ జై అని ఎందుకనాలి

- Advertisement -

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా తగ్గిపోతోందని, దీనిని గ్రహించిన బిజెపి నాయకులు ఏదో ఒక కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ మాతాకీ జై అని ఎందుకనాలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశభక్తి పేరుతో దేశంలో అందరిని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ దేశం ఏమైనా వారి అబ్బసొత్తా. వాళ్లు చెప్పినట్లు చేయకుంటే దేశంలో ఉండనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై అనే నినాదం దేశభక్తికి కొలమానం కాదని సురవరం అన్నారు. కరువు, నానాటికి పెరుగుతున్న ధరల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -