Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లి ఊరేగింపులో వధువు చేసిన పనికి అంతా ఫిదా..!

- Advertisement -

పెళ్లి వేడుకల్లో భాగంగా ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో అప్పుడప్పుడు నూతన వధూవరులు కూడా డ్యాన్స్​ చేస్తుంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు అదరగొట్టే ప్రదర్శన ఇచ్చింది. డ్యాన్స్​ కాదు మార్షల్ ఆర్ట్స్​ చేసి చూపించింది. తాను చిన్నప్పటి నంచి నేర్చుకున్న కరాటే, మార్షల్​ ఆర్ట్స్​ను పెళ్లి వేడుకలో ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిందీ ఘటన.

మాములుగా పెళ్లి కూతురంటే సిగ్గు మొగ్గలేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లి కూతురు ఏకంగా కర్రసాము చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. పెళ్లికూతురుకు ఆమె ఫ్రెండ్స్​ కూడా జతయ్యారు. వీరంతా కలిసి అద్భుతమైన ప్రదర్శన చేసి చూపించారు. పెళ్లి వేడుకను చూసిన బంధుమిత్రులు ఆమెను అభినందిస్తున్నారు.

తమిళ‌నాడులోని తిరుకోలూరు గ్రామానికి చెందిన నిషా(22).. రాజ్ కుమార్ అనే వ్య‌క్తిని ఇటీవ‌లే వివాహం చేసుకుంది. పెళ్లి వేడుకలో ఆమె కర్రసామును ప్రదర్శించింది. స్త్రీలు కూడా ధైర్యంగా ముందుకు సాగాలని ఆమె సూచించింది. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తాను కర్రసామును ప్రదర్శించానని చెప్పుకొచ్చింది.

Also Read: అన్నాడీఎంకేలో శశి ‘కలకలం’… చిన్నమ్మ పాచికలు పారతాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -