Sunday, April 28, 2024
- Advertisement -

Viral Video: యువకుడి ప్రశ్న..! సోషల్​ మీడియా మొత్తాన్ని కదిలించింది..!

- Advertisement -

ఏ ఆలోచన అయినా.. ఏ ఉద్యమం అయినా ఒక్కరితోనే మొదలవుతుందన్నది నిజం. తిరుగుబాటు కూడా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత అంతా ఆ వ్యక్తి వెనక నడుస్తారు. ప్రపంచ చరిత్రలో జరిగిన ప్రతిపరిణామం వెనక ఒక్కడి ఆలోచన.. ఒక్కడి తిరుగుబాటు ఉంటుంది. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు లేవనెత్తిన అంశం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ యువకుడు మాటలకు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రస్తుతం ముంబైలో లోకల్​ ట్రైన్స్​ అందుబాటులో ఉన్నా అందులో సామాన్యులు ప్రయాణించేందుకు అవకాశం లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. అయితే తాజాగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా లోకల్​ ట్రైన్​ ఎక్కాడు. దీంతో అతడిని రైల్వే సిబ్బంది పట్టుకొని వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ యువకుడు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో వైరల్​ గా మారింది. ఇంతకీ ఆ యువకుడు ఏమన్నాడంటే..

నాకు గత ఏడాది వరకు ఉద్యోగం ఉండేది. నెలకు రూ. 35000 సంపాదించేవాడిని. కానీ కరోనా లాక్​డౌన్ తో నా ఉద్యోగం పోయింది. తీవ్రంగా ప్రయత్నిస్తే ఇటీవలే నాకు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ట్రైన్​లో వెళ్లే అవకాశం ఉంది. కానీ నా లాంటి వేలాది మందికి లోకల్​ ట్రైన్స్​ ఆధారం. నన్ను ఏం చేయమంటారు’ అంటూ సదరు యువకుడు ప్రశ్నించాడు. అంతేకాక రైల్వే అధికారులకు ఫైన్​ కూడా కట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. సదరు యువకుడు లేవనెత్తిన అంశం కరెక్టెనంటూ నెటిజన్లు అతడితో గొంతుకలుపుతున్నారు.

Also Read: వధువుపై ముద్దుల వర్షం.. షాక్​ అయిన పెళ్లి కొడుకు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -