ఏపీలో ప్రతపక్ష వైసీపీ నుంచి ఇరవై ఒక్క మంది ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్న చంద్రబాబుకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.పిరాయింపు ఎమ్మెల్యేలను స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులకు మద్యన విబేధాలు ముదురుతున్నాయి.
మంత్రిపదవులు తీసుకున్న వారు తప్ప మిగిలిన వారి పరిస్థితి అగబ్యగోచరంగా తయారయ్యింది. టీడీపీ అధినేత ఎన్నిసార్లు చెప్పినా వారి మధ్య విబేధాలు సద్దుమనగడంలేదు. వైసీపీ నుంచి వచ్చిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీ శ్రేణులు తిరస్కరించడంతో వారు డమ్మీలు గా మారుతున్నారు. బాబు మందలింపులను లెక్క చేయకుండా నియేజక వర్గంలో పట్టుకోసం ఇరు వర్గాలు ప్రయత్నిస్తుండటంతో అధికార సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి.
తాజాగా ఒంగోలు టీడీపీలో విబేధాలు సద్దుమనగడంలేదు. వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటి రవిని ….టీడీపీ నేత కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల పార్లమెంట్ నియేజక వర్గ సమన్వయ కమిటీ సమావేశంలో గొట్టిపాటి రవి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో … సమావేశంనుంచి రవి బయటకు వచ్చేశాడు. గతంలో అనేక సార్లు అద్దంకి నియేజకవర్గంలో విబేధాలు బయటపడ్డాయి. ఇటీ వలే కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా… రవిని శత్రువులాగానే చూస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో గొట్టిపాటి రవి మాత్రమే జోక్యం చేసుకోవాలని బాబు చెప్పినా తెలుగు తమ్ముల్లలో మార్పు రాలేదు. ఒక్క అద్దంకి నియేజకవర్గంలోనే కాదు వైసీపీ నుంచి వచ్చిన 21 నియేజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితలు కనిపిస్తున్నాయి.దీంతో ఎందుకు జగన్‌ను వీడి టీడీపీలోకి వచ్చామని కొందరు ఎమ్మల్యేలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఎన్నిరోజులు ఇలా అవమానాలు భరించాలని కుంగిపోతున్నారు.దీంతో మళ్లీ సొంతగూటికి రావాలని చూస్తున్నారు. టీడీపీ తాయిలాలకు ఆశపడి..ఓట్లేసి గెలిపించిన నమ్మకాన్ని వమ్ముచేసిన నాయకులపై … చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
{youtube}D4dmDFbgLHM{/youtube}
Related