Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీకీ భ‌విష్య‌త్తు ఆశా కిర‌ణం బ్రాహ్మ‌ణేనా..?

- Advertisement -
Nara Brahmani speaks on Heritage expansion in the North India at Delhi

చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీ న‌డిపించే వారు ఎవ‌రంటే..అయ‌న కొడుకు నారా లోకేష్‌.అయితే ఆ ల‌క్ష‌ణాలు ఆయ‌న‌లో ఉన్నాయా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.  చంద్ర‌బాబు ఉన్నంత‌ రాజ‌కీయ ప‌రిణితి,చాకచ‌క్యం, పార్టీనీ న‌డిపంచ‌గ‌ల స‌త్తా ఇవ‌న్నీ లోకేష్‌లో ఏకోశాన లేన‌ట్లు ఆయ‌న తీరును చూస్తుంటే క‌నిపిస్తోంది. వైఎస్ రాజశేఖ‌రెడ్డి రాజ‌కీయ వార‌సుడిగా జ‌గ‌న్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో దూసుకుపో్తున్నారు. కానీ లోకేష్ మాత్రం అలా క‌నిపించ‌డంలేదు. భ‌విష్య‌త్తులో టీడీపీనీ నడిపించే స‌త్తా ఉందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

లోకేష్‌రాజ‌కీయాల్లోకి ఆర‌గ్రేటం అయిపోయింది. ముందుగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు. పార్టీమీద కొంత ప‌ట్టుసాధించిన త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి వెంట‌నే రాష్ట్ర ఐటీ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా చోటు క‌ల్పించారు. అయితే ప‌రిపాలన‌లో లోకేష్‌కు ఎటువంటి అనుభ‌వంలేదు. లోకేష్ వ్య‌వ‌హార‌శైలిమీద అనాలోచితంగా మాట్లాడుతూ సోషియ‌ల్ మీడియాలో ఎలా న‌వ్వుల‌పాలు అయ్యారో అంద‌రికీ తెలిసిందే. ఒక రాజ‌కీయ నాయ‌కునికి ఉన్న మాట‌క‌కారిత‌నం, ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనే విధానం,రాజ‌కీయ చ‌తుర‌త‌, మంచివ‌క్త‌లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంలేదు. అందుకే టీడీపీని భ‌విష్య‌త్తులో న‌డిపించే స‌త్తాపై అనుమానాలు క‌లుగుతున్నాయి. అయితే ఇప్పుడు నారా బ్రాహ్మ‌ణి …లోకేష్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం కొట్టోచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.

బ్రాహ్మ‌ణికి ఉన్నంత టాకింగ్‌, ప్ర‌జల‌ను ఆక‌ట్టుకొనే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో బాగా పాపులర్ అయిన హెరిటేజ్ ఉత్పత్తులు ఇకపై నార్త్ ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో దొరకనున్నాయి. ఉత్తరాదిలో హెరిటేజ్ ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ఈ సంస్థ ఢిల్లీలో ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న సమావేశంలో హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ నందమూరి బ్రాహ్మణి సంస్థ గురించి వివరించారు.

సంస్థ సాధించిన ఘనతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. నారా బ్రాహ్మ‌నీ మాట్లాడిన తీరు చూస్తూ ఆమెలో రాజ‌కీయ ల‌క్ష‌ణాలు పుస్క‌లంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. మాట్లాడ‌టంలో లోకేష్‌కు… బ్రాహ్మ‌ణికి న‌క్క‌తోకకు నాగ‌లోకానికి ఉన్నంత తేడా గ‌మ‌నించ‌వ‌చ్చు. కాగా… ఇటీవలే నారా బ్రాహ్మణి తన ఉద్దేశాలను వివరించారు. తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని.. వ్యాపార విస్తరణపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అయితే చెప్పిన‌ట్లు ఏవి జ‌ర‌గ‌వు. ఒకే వేల వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌స‌రం అయితే రాజ‌కీయ ఆరంగ్రేటం చేయ‌డంలో సందేహంలేదు. అందుకే భ‌విష్య‌త్తు నారాబ్రాహ్మ‌నీ అవ‌డంలో సందేహంలేదు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}Rs8d59HNbq8{/youtube}

Related

  1. ఎన్నికలకు… సీతాదేవికి లింకేంది బాబు…!
  2. జపాన్‌ ఆర్కిటెక్ట్ పుమిహికో మాకీ బాబు పై సంచలన వ్యాఖ్యలు
  3. ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై….బాబు,లోకేష్ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు.
  4. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -