Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ మేనిఫెస్టో..ఎన్ని లక్షల కోట్లు కావాలో తెలుసా?

- Advertisement -

సూపర్ సిక్స్ పేరుతో ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు చంద్రబాబు. ఇక చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుండే ఇవి అమలు అవుతాయా? అన్న సందేహం అందరిలో నెలకొంది. ఇక ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు మేనిఫెస్టోపై సందేహాలు వ్యక్తమవుతుండగా మరికొంతమంది ఎంత బడ్జెట్ కావాలో లెక్కలు కట్టే పనిలో పడ్డారు.

వాస్తవానికి సీఎం జగన్‌కు నవరత్నాలు అమలు చేయడానికి ఏటా డెబ్బై వేల కోట్ల బడ్జెట్ అవసరమైంది. కానీ ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఇంతకు పదిరేట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంటే ఏటా ఆరు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి తీసి పక్కన పెట్టాల్సి రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే వాస్తవానికి ఏపీ బడ్జెట్ ఎంత లెక్కలు కట్టినా మూడు లక్షల కోట్లు దాటే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు బాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే బడ్జెట్‌కు డబుల్ కావాల్సిందే. దీంతో సాధ్యమేనా అని సామాన్యుడు సైతం భావించాల్సిన పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి జగన్ నవరత్నాల మేనిఫెస్టో అమలు కష్టమైనా మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాల్సిందేనని ముందుకు సాగారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ చితికిపోయినా సంక్షేమాన్ని ఆపలేదు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు అన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దీంతో కేంద్రం నుండి పెద్దగా మద్దతు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో హామీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఈ మ్యానిఫేస్టో తప్ప ఆచరణకు సాధ్యం కాదని ముందే తేల్చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -