Monday, June 3, 2024
- Advertisement -

నారా లోకేష్ పరువు అడ్డంగా పోయింది

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే ఒకరు అవగాహన లేకుండా ఆడిన మాటలు ఇప్పుడు ఆ పార్టీ యువ నేత లోకేశ్ పరువును గంగలో కలిపేశాయి. లోకేశ్ భజనలో భాగంగా ఆయన్ను వెనకేసుకొచ్చేందుకు చెప్పిన మాటలే ఆయన పరువును బజారున పడేశాయి. లోకేశ్ వల్ల పార్టీకి – ప్రజలకు ఏమీ ఉపయోగం లేదంటూ విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో అవి నిజం అనేలా టీడీపీ ఎమ్యెల్యేయే మాట్లాడడంతో ఆ పార్టీ నేతలు వీడెవడండీ బాబూ అనుకుంటున్నారు.

టీడీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను విమర్శించే క్రమంలో ఆయన లోకేష్ హెవీవెయిట్ గా చెప్పాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఏనుగుతో పోల్చాలనుకున్నారు. అనుకున్నట్లే లోకేష్ ను ఏనుగుతో పోల్చారు. అయితే సాధారణ ఏనుగుతో పోల్చి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆయన లోకేష్ ను తెల్ల ఏనుగుతో పోల్చారు. 

ఒక తెల్ల ఏనుగు మీద బురద చల్లేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు తన పని తాను చేసుకుపోతుందన్నారు. అయితే వర్మ వ్యాఖ్యలు విన్న వారు మాత్రం నవ్వుకుంటున్నారు. లోకేశ్ ను విమర్శించేవారైతే మరిన్ని సెటైర్లు వేస్తున్నారు. అవును… లోకేశ్ తెల్ల ఏనుగే.. మేత తప్ప పని తక్కువని ఎద్దేవా చేస్తున్నారు.  ఖర్చు తప్ప ఫలితం లేని వస్తువులు… తిండి తప్ప పనిచేయని మనుషులను వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తారు. పాపం… ఎమ్మెల్యే వర్మకు అదేమీ తెలిసినట్లుగా లేదు. పదం బాగుందని లోకేశ్ ను తెల్ల ఏనుగుతో పోల్చారు. అది కాస్త బెడిసికొట్టడంతో నవ్వులాటగా మారిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -