- Advertisement -

ఈసారి భారత్‌కు అదృష్టం వరిస్తుందా!

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌ని చేజార్చుకున్న టీమిండియా భారీ అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్‌ను సాధించే దిశగా ప్రయత్నిస్తోంది. 2007 తర్వాత ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌ని గెలవలేదు భారత్.దీంతో ఈ సారి టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగింది.

ఈ సారి టీ20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటుండగా అమెరికా, కెనడా, ఉగాండా తొలిసారి టీ 20 వరల్డ్‌కప్‌లో ఆడుతున్నాయి. భారత్‌తో పాటు ఆతిథ్య విండీస్ టైటిల్ ఫేవరెట్ రేసులో ఉంది. దీంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ సైతం తాము ఈసారి కప్ ఎగరేసుకుపోతామని చెబుతున్నాయి.

టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనుండగా 16 మ్యాచ్‌లు అమెరికాలో, మిగితావి వెస్టీండిస్‌లో జరగనున్నాయి. భారత్ తొలి మ్యాచ్‌ ఈ నెల 5న ఐర్లాండ్‌తో ,9న న్యూయార్క్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. సూపర్ 8 మ్యాచ్‌లకు వెస్టెండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ రాత్రి 8గంటలకు ప్రారంభం కానున్నాయి.

గ్రూప్ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుండగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీస్, ఫైనల్ ఉంటాయి. ఈ నెల 27న రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 29న వెస్టెండీస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో జరుగుతుంది. 2007 నాటి మ్యాజిక్‌ను టీమిండియా రిపీట్ చేసి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుండగా రోహిత్ సేన ఏం చేస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -