ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఇప్పటికీ సర్ధుబాటు, ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగని అంశాలు చాలానే ఉన్నాయి. అందులో తెలుగు అకాడమీ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పాటైన తెలుగు అకాడమీ విభజన అంశం రాష్ట్ర విభజన జరిగి ఎండ్లు గడుస్తున్న ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ.. తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రస్తుతం తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్థుల పంపకానికి సంబంధించిన అంశం దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చేరింది. ఇటీవలే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల పంపకం, ఆస్తులు-అప్పులు వంటి అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ తరహా అంశాలు, వ్యవహారాలకు సంబంధించి న్యాయస్థానాల్లోనే పరిష్కారం లభిస్తుందని తెలిపింది.
అయితే, తాజాగా న్యాయస్థానం ఆదేశాలపై పై తెలంగాణ సర్కారు అభ్యంతర వ్యక్తం చూస్తూ.. సుప్రీంకోర్టు మెట్లెక్కింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించిన అంశాలు న్యాయ పరిధిలోకి రాదని తన పిటిషన్ లో అభ్యంతరం తెలిపింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా లతో ధర్మాసనం.. దీనిపై స్పందనను తెలియజేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాలని సూచించింది. పరిష్కారం లభించకపోతే దీనిపై తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది.
తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం
బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి