Thursday, March 28, 2024
- Advertisement -

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

- Advertisement -

విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం దేశ సినీ ఇండ‌స్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగుతున్న పేరు. త‌మిళ వెండితెర‌పై మెరుపులు మెరిపించి ప్ర‌స్తుతం ద‌క్షిణాది స్టార్ హీరోగా ఎదిగారు. త‌న‌దైన స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో హీరో, విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనే సంబంధం లేకుండా అన్ని పాత్రలకు త‌గిన న్యాయం చేయ‌డంలో ఆయ‌న దిట్ట‌. అందుకే ఆయ‌న‌తో సినిమాలు తీయ‌డానికి త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లే కాకుండా, ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌ల‌న్ని విజ‌య్ సేతుప‌తితో సినిమాలు తీయ‌డానికి క్యూక‌డుతున్నారు.

విజ‌య్ సేతుప‌తి అద్భుత న‌ట‌న‌కు ద‌క్షిణాది సినిమాల‌లోనే కాకుండా బాలీవుడ్ అవ‌కాశాలు సైతం ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌, అలాగే, తెలుగు సంచ‌ల‌న మూవీ ఉప్పెన‌లో నెగ‌టివ్ రోల్ లో అద్భుతంగా న‌టించ‌డంతో ఆయ‌న పేరు ఓ రేంజోలో మారుమ్రోగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్ ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు.

అయితే, ఇప్ప‌టివ‌ర‌కు వెండితెర‌పై మెరుపులు మెరిపించిన ఈ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి.. బుల్లితెర‌పై కూడా అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ విజయ్ సేతుపతితో కలిసి ఒక టీవీ షోను ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయ‌. దీంతో ఆయ‌న అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు.

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?

శృతిహాస‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -